నేడు ఆధార్ పై సుప్రీం తీర్పు

ఆధార్ సీక్రెట్ పై నేడు తీర్పు చెప్పనుంది సుప్రీంకోర్ట్. ఆధార్ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతికి చిక్కితే దుర్వినియోగమయ్యే ముప్పుందని తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. వ్యక్తుల వేలి ముద్రలు, కనుపాపలు తదితర బయోమెట్రిక్‌ సమాచారంతో కూడిన ఆధార్‌ ను తప్పనిసరి చేయరాదంటూ పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మొత్తం 27 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధార్‌ చట్టాన్ని తప్పుపడుతూ… మానవ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే చట్టమేదీ చట్టంగా మనజాలదు అని తెలిపాయి.

ఈ క్రమంలోనే- గోప్యత అన్నది ప్రజల జీవితాల్లో, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-21 దీనికి భరోసానిస్తుంది అని పోయిన సంవత్సరం సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వం పలు విధాలుగా ఆధార్‌ జారీని సమర్థించుకుంటోంది. కోట్లాదిమంది పౌరులకు నిధులను, ప్రయోజనాలను, సేవలను సక్రమంగా అందజేయడానికి ఇది తప్పనిసరి అంటోంది. ఈ సమాచార నిధి భద్రతకు ఢోకా లేదనీ, ఇది దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని చెబుతోంది. ఈ వివాదంపై గత జనవరిలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… రికార్డు స్థాయిలో 38 రోజుల పాటు వరుసగా విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదోపవాదాలు ముగిశాయి. బుధవారం ఐదుగురు  సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనిపై తీర్పును వెల్లడించనుంది.

 

Posted in Uncategorized

Latest Updates