నేడు ఆసియాకప్ ఫైనల్ : బంగ్లాతో భారత్ మ్యాచ్

దుబాయ్ : ఆసియాకప్ ఫైనల్ కి చేరింది. ఇవాళ భారత్ తో బంగ్లా ఢీకొట్టనుంది. అందరూ ఊహించినట్లుగా భారత్-పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ కాకపోవడంతో.. అభిమానులు నిరాశకు గురైనా.. సంచలన ఆటతీరుతో దూసుకొచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు అసలు సిసలు పోరాటాన్ని చూపేందుకు సిద్ధమైంది. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ లో సూపర్ స్టార్లతో కూడిన టీమ్‌ ఇండియాను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్‌ పై గురిపెట్టిన రోహిత్‌ సేన.

అందుకు అనుగుణంగానే లీగ్ దశ నుంచి తమ సత్తా ఏంటో చూపెడుతూ వచ్చింది. ఫేవరేట్ గా బరలోకి దిగనుంది. ఆసియాకప్-2018లో ఓటమి ఎరుగని భారత్.. బిగ్ విక్టరీతో ముగించాలని చూస్తోంది.  అదృష్టాన్ని ఎప్పుడూ వెంబడేసుకుని తిరిగే బంగ్లా.. చావోరేవో మ్యాచ్‌ లో పాక్‌ ను చిత్తు చేయడం అత్యంత ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. అలాంటి ఆటతీరును ఫైనల్లోనూ చూపించి ఫస్ట్ టైటిల్‌ ను సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీనికితోడు 2016 ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.  2012లోనూ ఫైనల్‌ కు చేరుకున్నా.. టైటిల్ ఆశ మాత్రం తీరలేదు. సో.. ముచ్చటగా మూడోసారి ఫైనల్‌ కు రావడంతో.. ఈసారైనా సగర్వంగా ట్రోఫీని ముద్దాడాలని కలలుగంటుంది. అయితే ఈ కల సాకారం కావాలంటే టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆటకు పదిరెట్లు అదనంగా బలాన్ని చూపించాలి. మరి బంగ్లా పసికూనలా తోక ముడుస్తుందా..టైగర్ లా రెచ్చిపోతుందా చూడాలి..!

మ్యాచ్ : సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో లైవ్.

Posted in Uncategorized

Latest Updates