నేడు ఇంగ్లాండ్ తో భారత్ ఫస్ట్ వన్డే

నేటి నుంచి మరో టఫ్ ఫైట్ కు జరగనుంది. క్రికెట్ లో వరల్డ్ టాప్ 2 జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో గురువారం (జూలై-12) సాయంత్రం 5 గంటలకు భారత్, ఇంగ్లండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ఆడటం, అద్భుతమైన ఫామ్ ఇంగ్లండ్ కు బలమైతే… టీ20 సిరీస్ గెలిచి జోరుమీదున్నది కోహ్లిసేన. వన్డే సిరీస్ నూ కైవసం చేసుకోవాలని చూస్తోంది. సిరీస్ గెలిచి వన్డేల్లో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలనుకుంటోంది ఇంగ్లాండ్.

పిచ్, వాతావరణం
ఇంగ్లండ్‌లో ఇది నడి వేసవి. పొడిబారిన పిచ్‌ సిద్ధం కావడంతో.. పరుగుల వరద ఖాయం. ఇంగ్లండ్‌ రెండు వరల్డ్‌ రికార్డు స్కోర్‌లు (444, 481) గత రెండు మ్యాచ్‌ లలో ఇదే స్డేడియంలో వచ్చాయి.
మ్యాచ్ : సాయంత్రం గం. 5 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లో లైవ్

Posted in Uncategorized

Latest Updates