నేడు ఐర్లాండ్ తో ఫస్ట్ టీ 20 : భారత్ కు వందో ఇంటర్నేషనల్ మ్యాచ్

India-vs-Irelandటీమిండియాకు ఇవాళ (జూన్-27) మరిచిపోలేని రోజు. బుధవారం రాత్రి 8 గంటలకు ఐర్లాండ్ తో టీమిండియా ఫస్ట్ టీ20 జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్.. భారత్‌ కు 100వ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌. ఇప్పటివరకు 62 మ్యాచ్‌ లు గెలిచి, 35 ఓడింది. 2 మ్యాచ్‌ లలో ఫలితం తేలలేదు. దీంతో ఐర్లాండ్ తో జరగబోయే ఈ సెంచరీ మ్యాచ్ ఓ రికార్డ్ అయితే..ఇలాంటి మ్యాచ్ లో గ్రేట్ విక్టరీ సాధించాలని పట్టుతో ఉంది టీమిండియా.

సౌతాఫ్రికా టూర్ తర్వాత ఫస్ట్ టైం తమ పూర్తి స్థాయి జట్టుతో మరో అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఐర్లాండ్ తో రెండె టి20 మ్యాచ్‌ ల సిరీస్‌ లో భాగంగా బుధవారం డబ్లిన్ లో ఫస్ట్ మ్యాచ్‌ జరుగనుంది. టీమ్ బలాబలాలు, ఫామ్‌ దృష్ట్యా చూస్తే భారత్‌ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌ కు టి20ల్లోనూ మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.  టీమిండియా తమ ఆఖరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ మార్చిలో నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ పై ఆడింది. అయితే ఆ టోర్నీ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి, ధోని, భువనేశ్వర్, బుమ్రా ఇప్పుడు తిరిగొచ్చారు. ఈ నలుగురు కూడా తుది జట్టులో ఖాయం. అయితే  ఫామ్‌ ప్రకారం చూస్తే ధోని వచ్చినా.. దినేశ్‌ కార్తీక్‌ కు బ్యాట్స్‌మన్‌ గా స్థానం దక్కవచ్చు.

లోకేశ్‌ రాహుల్‌ కూడా టీమ్‌ లో ఉండే అవకా శం ఉంది.  మనీశ్‌ పాండేకు చోటు కష్టంగా కనిపిస్తోంది. టి20ల్లో అద్భుత రికార్డు ఉన్నా…  రైనాకు కూడా స్థానం అనుమానంగా ఉంది. హార్దిక్‌ పాండ్యాతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ లో ఇక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు  చహల్, కుల్దీప్‌ లను కోహ్లి కచ్చితంగా ఫైనల్ టీమ్ లో సెలక్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పేసర్ల స్థానాల్లో భువీ, బుమ్రాలు తప్పనిసరి. అయితే ఇటీవల మంచి ఫామ్‌ లో ఉండి పునరాగమనం చేసిన ఉమేశ్‌ కు అవకాశం ఇవ్వాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి తప్పదు. సిద్ధార్థ్‌ కౌల్‌  అవకాశం కోసం కొంత కాలం వేచి చూడక తప్పదు.

టీమ్స్.. అంచనా
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, కార్తీక్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా/ఉమేశ్‌.
ఐర్లాండ్‌: విల్సన్‌ (కెప్టెన్‌), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్‌ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్‌ రెల్, మెకార్తీ, ఛేజ్‌.

Posted in Uncategorized

Latest Updates