నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV- F11 రాకెట్

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలోని  శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఇవాళ(బుధవారం)  సాయంత్రం 4.10 గంటలకు జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌11ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ జీ శాట్‌-7ఏ శాటిలైట్‌ను భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 26 గంటలపాటు కొనసాగనుంది.

2,250 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్‌-7ఏ ఎనిమిదేళ్ల పాటు సేవలు అందించనుంది. మంగళవారం ఉదయం ఇస్రో ఛైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 35 రోజుల్లో ఇది మూడో ప్రయోగమని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates