నేడు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ : కీలక అంశాలపై చర్చ

modi kcrఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం (జూన్-15) మధ్యాహ్నం పన్నెండున్నరకు  ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు కీలక సమస్యలపై చర్చించనున్నారు.  కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసు చేయాలని ప్రధానిని కోరనున్నారు. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలు, మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్లపై ప్రధానితో  చర్చించనున్నారు.

రైతు బంధు, రైతు బీమా పథకాల అమలును మోడీకి వివరించనున్నారు సీఎం. శుక్రవారం, శనివారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఆదివారం (జూన్-17) జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates