నేడు మాల్యా కేసుపై.. బ్రిటన్ కోర్టు తీర్పు

లండన్‌: బ్యాంకులకు రూ.9వేల కోట్లను ఎగవేసి, 2016లో బ్రిటన్‌ కు పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసుపై ఇవాళ డిసెంబర్ 10న బ్రిటన్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఆయనపై అక్రమ నగదు చలామణీ, రుణాల నిధులు ఇతర అవసరాలకు మళ్లింపు ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మాల్యాను వెనక్కు పంపాలన్న భారత్‌ అభ్యర్థనపై లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టెర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ చేపడుతుంది.

కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా బ్రిటన్‌ హోం మంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఈ కీలక విచారణకు హాజరయ్యేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సంయుక్త డైరెక్టర్‌ ఎస్‌ సాయి మనోహర్‌ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌ బయలుదేరి వెళ్లింది. CBI ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు బదులుగా మనోహర్‌ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates