నేడు మూడు జిల్లాల్లో సీఎం పర్యటన

28279356_1472360919542071_7370819557424883465_nసీఎం కేసీఆర్ కాసేపట్లో  మూడు  జిల్లాల పర్యటనకు బయల్దేరనున్నారు. మంగళవారం (ఫిబ్రవరి-27) ఆదిలాబాద్ జిల్లాలోని చెనాక- కొరాట బ్యారేజీ పనులను పరిశీలించనున్నారు. మంచిర్యాలలో భూగర్భ గనులకు శంకుస్థాపన చేస్తారు. ఇవాళ పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్  నుంచి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో  బయలుదేరి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్మూర్ కు చేరుకుంటారు.

అక్కడ రెండు ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభిస్తారు. మిషన్ భగీరథ వాటర్ ట్రిట్ మెంట్ ప్లాంట్ ను సందర్శిస్తారు సీఎం. ఉదయం 11 గంటలకు పెద్దపల్లి జిల్లా నుంచి బయలుదేరి 11 గంటల 40 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనాక-కొరాట బ్యారేజీ దగ్గరకు చేరుకుంటారు. పనులను పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి 12 గంటల 10 నిమిషాలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. డైట్ కాలేజీ మైదనాంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు కేసీఆర్.  మూడు గంటలకు మంచిర్యాల చేరుకొని భూగర్భ గనులకు శంకుస్థాపన చేస్తారు కేసీఆర్. సాయంత్రం ఐదుగన్నరకు హైదరాబాద్ కు బయలు దేరుతారు.  సీఎం పర్యటన సందర్భంగా మూడు జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లాల మంత్రులు, అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates