నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..

టీఆర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌, ఎమ్మెల్యే కేటీఆర్‌‌ ఇవాళ(బుధవారం) తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి ఆయన సిరిసిల్లకు వెళ్లనున్నారు. వాస్తవానికి ఆయన మంగళవారమే సిరిసిల్ల వెళతారని భావించినా పర్యటన బుధవారానికి వాయిదా పడింది.

ఉదయం 10 గంటలకు సిరిసిల్ల శివార్లలోని తంగళ్లపల్లి బ్రిడ్జి దగ్గరకు కేటీఆర్‌ ‌చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపానికి వచ్చి.. పార్టీ శ్రేణులతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates