నేడు సీఎంగా కేసీఆర్ ప్రమాణం

TRS అధినేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ డిసెంబర్-13న బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌ భవన్‌ లో  ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్‌ ఒక్కరే ప్రమాణం చేయనుండగా.. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు తర్వాత వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతోపాటు 17 మంది మంత్రులు ఉండాలి.. ఈ లెక్కల ప్రకారం.. సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌ లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ బలపరిచారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరు చప్పట్లతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

Posted in Uncategorized

Latest Updates