నేడు హాకీ ప్రపంచకప్ క్వార్టర్స్‌ : నెదర్లాండ్స్‌ తో భారత్ ఢీ

భువనేశ్వర్ : వరల్డ్ కప్ లో మరో సంచలనానికి రెడీ అయ్యింది హాకీ ఇండియా. సెమీఫైనలే లక్ష్యంగా ప్రపంచకప్ లో మరో రికార్డ్ కు సిద్దమైంది. సాయంత్రం జరిగే క్వార్టర్ ఫైనల్లో పటిష్ఠ నెదర్లాండ్స్ తో తాడోపేడో తేల్చుకోనుంది. డచ్ టీమ్ ను ఓడించి నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది మన్ ప్రీత్ సింగ్ సేన. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్  ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లోనూ ఓడలేదు.

అయితే వాల్డ్ కప్ చరిత్ర మాత్రం భారత్ ను కలవరపెడుతోంది. అయితే ప్రస్తుతం ఫామ్ పరంగా చూస్తే రెండు జట్లకు సమాన అవకాశాలున్నాయి. నాలుగో ర్యాంకులో ఉన్న నెదర్లాండ్స్ కు దీటుగా ఐదో ర్యాంకర్  భారత్ రాణిస్తోంది. 1975లో టైటిల్  గెలిచిన తర్వాత భారత్ …ఒక్కసారి కూడా సెమీస్ కు చేరలేకపోయింది. అయితే ప్రపంచ కప్ లో డచ్ పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఈ మెగా టోర్నీలో రెండు జట్లు ఆరుసార్లు తలపడితే నెదర్లాండ్స్ ఐదుసార్లు నెగ్గగా….ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిసారి చాంపియన్స్  ట్రోఫీలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్….1-1 తో డ్రాగా ముగిసింది. మరోవైపు 2013 నుంచి భారత్, డచ్ టీమ్ లు తొమ్మిదిసార్లు తలపడితే….చెరో నాలుగు మ్యాచ్ లు నెగ్గగా.. ఒకటి డ్రాగా ముగిసింది.

 

Posted in Uncategorized

Latest Updates