నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి

శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, పలువురు నేతలు, ప్రముఖులు ప్రెసిడెంట్‌ కోవింద్‌కు స్వాగతం పలకనున్నారు. ప్రెసిడెంట్‌ విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇప్పటికే ముస్తాబైంది. రేపు రాష్ట్రపతి కరీంనగర్‌లో పర్యటిస్తారు. అక్కడ ప్రతిమ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కొన్ని కొత్త విభాగాలను ఆయన ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో నాలుగు రోజులు బస చేసి ఈ నెల 24 సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళతారు. రాష్ట్రపతి విడిది ముగిసిన తర్వాత రోజు నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు ప్రజలను అనుమతిస్తారు.

Posted in Uncategorized

Latest Updates