నేడు TRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్ :  తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఆ తర్వాత సహకార, పార్లమెంటు, ఎంపీపీ తదితర ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత, కేసీఆర్ పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే దిశానిర్దేశం చేయగా.. ఇవాళ డిసెంబర్-14న పార్టీ కార్యవర్గ సమావేశంలో అందరికీ సూచనలివ్వనున్నారు. తెలంగాణభవన్‌ లో మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే రాష్ట్ర కమిటీ సమావేశానికి కమిటీలోనివారందరినీ ఆహ్వానించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం, భవిష్యత్‌లో పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. రాబోయే మూడునెలల్లో పార్టీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణాలు పూర్తిచేయడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై పార్టీ నాయకులకు చెప్పనున్నారు. లంబాడి తండాలు, ఆదివాసీ గూడేలను TRS ప్రభుత్వం పంచాయతీలుగా మార్చింది. కొత్తగా 4వేల 383 పంచాయతీలను ఏర్పాటుచేసింది. 2 వేల551 తండాలు పంచాయతీలయ్యాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపొందించి అనేక విధులు, బాధ్యతలను చేర్చారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేందుకు కృషిచేయాలని.. ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ కార్యవర్గానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates