నేడే అక్షయ తృతీయ : బంగారంపై భారీ ఆఫర్లు

GOLD OFFERS AKSHAYAలక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే లక్ష్మిదేవి ఎప్పటికి మనతోనే ఉంటుందనే నమ్మకంతో గోల్డ్ కొంటామంటున్నారు పబ్లిక్. బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయను ఎంతో శుభప్రదమైనదిగా చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో ఈ రోజు బంగారం కొనుగోళ్లు కూడా భారీగానే చేపడతారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురష్కరించుకుని కంపెనీలు సైతం భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి.

ఈ సారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్‌ జువెల్లర్స్‌ బంగారం, డైమాండ్‌ జువెల్లర్స్‌ మేకింగ్‌ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. అదేవిధంగా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ కూడా గోల్డ్‌ కాయిన్లను, గిఫ్ట్‌ కార్డులను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. గోల్డ్‌ కాయిన్లపై పీసీ జువెల్లర్స్‌ తక్కువ ధరలనే ఆఫర్‌ చేస్తోంది. ఇలా ఆఫర్లతో బంగారం దుకాణాలు హోర్రెత్తిస్తున్నాయి. ఈ పండుగ కోసం మిషన్ మేడ్ డిజైన్లు కాకుండా చేత్తో చేసిన కలెక్షన్లను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. పండుగ వారం ముందునే వెరైటీ డిజైన్లను మోడల్స్ తో లాంచ్ చేయించారు. దీంతో షాపులు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates