నేతన్న ట్యాలెంట్ : దబ్బనంలో పట్టే చీరను తయారు చేశాడు

636534761741633975రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది హరిప్రసాద్ వృత్తి రిత్యా నేత కార్మికుడు. అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించడం ఇతని ప్రత్యేకత. ఇప్పటికే పవర్ లూం పరిశ్రమకు సంబంధించిన వివిధ యంత్రాలను సూక్ష్మంగా తయారు చేసి వాటిపై దుస్తులను నేశాడు. ఇతను గతంలో ఆరు ఇంచుల సైజులో మరమగ్గాన్ని తయారు చేశాడు. చిటికె వేస్తే ఆన్ – ఆఫ్ అవ్వడం ఈ మరమగ్గం ప్రత్యేకత. అదే సైజులో వార్పన్ యంత్రాన్ని కూడా తయారు చేసి అందరిని అశ్యర్యపరిచాడు. తర్వాత అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నాన్ని తయారు చేయడంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు హరిప్రసాద్. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల ముడి సరుకుతో దబ్బనంలో దూరే అతి తక్కువ బరువున్న చీరను ఉత్పత్తి చేశాడు. 5.5మీటర్ల పొడవు, 47ఇంచుల వెడల్పు, 135 గ్రాముల బరువుతో నాణ్యమైన చీరను తయారు చేశాడు.

మామూలు చీరకంటే 3 ఇంచులు ఎక్కువ సైజుతో దబ్బనంలో పట్టే చీర ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితుల తోడ్పాటుతో మరమగ్గాలు, వాటి ఉత్పత్తుల్లో కొత్తదనానికి నాంది పలికేలా నిరంతరం ప్రయోగాలు చేస్తున్నాడు హరిప్రసాద్. ప్రస్తుతం మరమగ్గాలు పూర్తిస్థాయిలో విద్యుత్ పై ఆధారపడి నడుస్తున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్దలు ఆర్థిక సాయం చేస్తే సోలార్ తో నడిచే మరమగ్గాలను తయారు చేస్తానంటున్నాడు హరి ప్రసాద్. ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తే.. అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు చేనేత కళాకారుడు హరిప్రసాద్.

Posted in Uncategorized

Latest Updates