నేనింతే.. : ట్రంప్ చేష్టలతో బ్రిటన్ వాసుల ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటన వివాదాలు సృష్టిస్తోంది. ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు బ్రిటన్ వాసుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాణిని భేటీ అయ్యే సమయంలోనూ ఇలాగే ప్రవర్తించి.. బ్రిటన్ ప్రజలతో తట్టించుకుంటున్నాడు ట్రంప్. మరోవైపు ఈయన పర్యటనకు వ్యతిరేకంగా లక్షల మంది మహిళలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

ట్రంప్ చేష్టలు ఇలా ఉన్నాయి :

… ఎలిజెబెత్ రాణితో భేటీకి లండన్ లోని విండ్సన్ క్యాసిల్ కు 12 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు ట్రంప్. దీంతో 92ఏళ్ల రాణి.. ఆయన కూడా అలాగే నిలబడి వేచి ఉన్నారు.

… ఎలిజెబెత్ రాణితో భేటీ సమయంలో అక్కడి రూల్స్ ప్రకారం మొదట షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ తర్వాత తల వంచి నమస్కారం చేయాలి. షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్.. తల వంచలేదు కదా.. తలెత్తుకుని కిందకి చూస్తూ ఆమెతో మాట్లాడాడు.

… ప్యాలెస్ లో ఇచ్చే గౌరవ వందనంలో సమయంలో రాణి వెనక ట్రంప్ నడవాల్సి ఉంది. అయితే ఆమె కంటే ముందే ట్రంప్ నడుస్తూ వెళ్లాడు. ఆ తర్వాత కూడా పక్కనే నడిచాడు కానీ.. వెనక మాత్రం రాలేదు. నడిచింది కొద్ది దూరమే అయినా రాణికి అడ్డుతగులుతూ.. అటూ ఇటూ తిరుగుతూ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహరించిన తీరు.. విమర్శలకు దారి తీసింది.

… ట్రంప్ తోపాటు ఫస్ట్ లేడీ మెలానియా కూడా రాణి ఎదుట తల వంచలేదు. ప్రొటోకాల్ పాటించలేదు.

ట్రంప్ వ్యవహారశైలిని టీవీల్లో చూసిన బ్రిటన్ వాసులు కోపంతో ఊగిపోతున్నారు. రాణి ఎదుట ప్రోటోకాల్ ప్రకారం పాటించాల్సిన నిబంధనలు కూడా పాటించకపోవటం ఏంటని నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates