నేను ఉండను బాబోయ్ ఈ పార్టీలో : పాండా

bjpబిజు జనతాదళ్  పార్టీ నుంచి శాస్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ ఎంపీ జే పాండా. దీనికి సంబంధించి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు. సీఎంతో విభేదాల కారణంగా పాండాను జనవరిలోనే పార్టీ నుంచి డిస్‌మిస్‌ చేస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పాండా సోమవారం(మే-28) పార్టీ నుంచి శాస్వతంగా తొలగిపోతున్నట్లు నవీన్‌ పట్నాయక్‌కు లేఖ ద్వారా తెలిపారు.

తనకు ఇష్టం లేకున్నా…పరిస్థితుల ప్రభావంతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని లెటర్ లో తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారే ముఖ్యమైన స్థానంలో ఉన్నారని… వారి నుంచి పార్టీని కాపాడాలని లేఖలో తెలిపారు. బీజేపీతో సంబందాలు ఉన్నాయన్న కారణంతో పాండాను  పార్టీని నుంచి బహిష్కరించామని బీజేడీ చెప్పింది.  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పాండా బీజేపీ మద్దతు తెలిపారని, కనీసం తన నియోజకవర్గంలో కూడా పార్టీ తరుపున ప్రచారం చేయలేదని బీజేడీ ఆరోపించింది.


Posted in Uncategorized

Latest Updates