నేను కొంచెం ఢిఫరెంట్ : పుతిన్ గొడుగుపై ఆగని సోషల్ మీడియా

ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురు చూసిన ఫిఫా వరల్డ్ కప్-2018 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మాస్కోలో జరిగింది. ఈ మ్యాచ్ ను చూడడానికి అనేక దేశాల నుంచి అభిమానులు, దేశాధ్యక్షులు, ప్రముఖులు వచ్చారు. రసవత్తరంగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. రన్నరప్ గా క్రొయేషియా నిలిచింది. ఈ మ్చాచ్ సందర్భంగా జరిగిన అనేక అద్భుతమైన సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా పుట్ బాల్ అభిమానులను అలరించాయి. వరల్డ్ కప్ ట్రోఫీని విజేత ఫ్రాన్స్ కు అందజేసే కార్యక్రమంలో పలువురు దేశాధ్యక్షులు పాల్గొన్నారు. స్టేజీపై అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూసిన వానదేవుడు తాను కూడా ఈ సంబరాల్లో భాగం కావాలని భావించాడు. వెంటనే స్టేడియంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తొలకరి జల్లుగా స్టేడియాన్ని పలుకరించాడు.
ప్రపంచ అధినేతలంతా వర్షంలోనే తడిసి ముద్దవుతూ ఈ వేడుకను ఎంజాయ్‌ చేశారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఒంటిపై చినుకు కూడా పడకుండా.. గొడుగు వేసుకుని నిల్చున్నారు. స్టేజీపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌, క్రొయేషియా అధ్యక్షుడు కోలిండా గ్రాబార్-కిటరోవిక్ మధ్యలో పుతిన్‌ నిలబడ్డారు. అయితే అందరూ వర్షంలో తడుస్తూ ఉన్నా పుతిన్‌ గొడుగు వేసుకొని నిలబడటంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు సైటైర్లు వేస్తున్నారు. రష్యాలో అదొక్క గొడుగు మాత్రమే ఉన్నట్లుందని, ఏమైనా మీరు పెద్ద గ్యాంస్టర్ అని, ప్రపంచంలోనే మీరు ఢిఫరెంట్ అని ఫన్నీగా పుతిన్ తీరుపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముందు పుతిన్ కు పెద్ద గొడుగు ఆ తర్వాత గెస్ట్ లకు చిన్న గొడుగు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ట్రోఫీ సెర్మనీని పుతిన్ గొడుగు బయటపడకుండా చేసిందని జమ్మూ-కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates