నేను క్షేమం: దీపికా పదుకొనె

deepikaతాను క్షేమంగానే ఉన్నాని తెలిపింది బాలీవుడ్ నటి దీపికా పదుకొనె. బుధవారం(జూన్-13) ముంబైలోని బ్లూ మౌంట్స్ టవర్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇదే భవనంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నివసిస్తుండటంతో.. ఆమెకు ఏమైనా జరిగిందేమో అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో తనకేమి జరగలేదని ట్విట్టర్ ద్వారా తెలిపింది దీపికా.

తాను సురక్షితంగా ఉన్నానని.. అందరికీ ధన్యవాదాలు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కోసం అందరూ ప్రార్థనలు చేయండని’ అభిమానులను ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది దీపికా.

ప్రమాదం కారణంగా పై రెండంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates