నేను తప్పుకుంటున్నా : బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా

haribabuభారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాల మధ్య మంగళవారం హరిబాబు రాజీనామా ప్రకటించారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

చిరకాల మిత్రుడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల క్రమంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పుకు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గి చూపినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates