నేను ప్రచారం చేస్తే ఓట్లు పడవ్: దిగ్విజయ్

ఒకవైపు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుండగా..మరోవైపు పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీనిపై మీడియా ఆయనను పలుకరించగా..నేను ప్రచారానికి వెళ్లి మాట్లాడానంటే మా పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా పడవు. అందుకే వెళ్లడం లేదు. పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇలా దూరం పాటిస్తున్నాను అని బదులిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న దిగ్విజయ్..ఎన్నికల వేళ ప్రచారానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.

Posted in Uncategorized

Latest Updates