నేను బతికేది కొన్ని రోజులే : ఇర్ఫాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు అభిమానులకు గుండెలు పగిలే విషయం చెప్పాడు. తాను బతికేది కొన్ని రోజులే అన్న విషయాన్ని వెల్లడించి షాక్ కు గురి చేశారు. కేన్సర్‌ తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.

తాను బతికేది మరికొన్ని నెలలు మాత్రమేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల్లోనే చనిపోతానని తన మెదడు చెప్పేసిందన్నాడు. న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఇలా చెప్పుకొచ్చారు. నేను బతికేది మరికొన్ని నెలలు మాత్రమే.. మహా అయితే రెండేళ్లు కావచ్చు. ఇకపై నాకున్న జీవితాన్ని హ్యాపీగా అనుభవిస్తాను అని తెలిపాడు ఇర్ఫాన్.

ఈ అనుభవంతో జీవితంపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నాడు. ప్రస్తుతం కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, మొత్తం ఆరు జరగాల్సి ఉందన్నాడు. ఆరు సైకిళ్లు పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉందన్న ఇర్ఫాన్.. ఆ తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుందన్నాడు.

Posted in Uncategorized

Latest Updates