నేను మాట్లాడను : కేరళ సీఎంకు నాలుగోసారి అపాయింట్ మెంట్ నిరాకరించిన మోడీ

modiకేరళ ముఖ్యమంత్రి  పినరయి  విజయన్ కు  ప్రధాని మోడీ..మరోసారి  అపాయింట్ మెంట్ నిరాకరించారు.  ఒకట్రెండు  సార్లు కాదు.. ఇది  వరసుగా నాలుగోసారి.  కేరళకు  రేషన్ బియ్యం  కేటాయింపుల్లో… అసమానతలపై  ప్రధాని మోడీతో చర్చించేందుకు  అనుమతివ్వాలని సీఎం పినరయి విజయన్ పీఎంవోను  కోరారు. అయితే మోడీ  అపాయింట్ మెంట్  కావాలని అడిగినప్పుడల్లా పీఎంవో  అధాకారులు  కేరళ సీఎంకు  నో  చెప్తున్నారు. మోడీ అపాయింట్ మెంట్  ఇవ్వకుండా ….అవసరమైతే   బియ్యం కేటాయింపులపై  కేంద్ర ఆహార, పౌరసరఫరాల  శాఖ  మంత్రి రామ్ విలాస్  పాశ్వాన్ తో  చర్చించాలని  సూచించారు. పీఎంవో  తీరుపై  తీవ్ర  అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు  కేరళ ముఖ్యమంత్రి.

 

Posted in Uncategorized

Latest Updates