నేనే నెం.1: ప్రపంచంలోనే పెద్దాయన

JPప్రపంచంలో బతికి ఉన్న ఎక్కువ వయస్సు కలిగిన వృద్ధుడిగా జపాన్‌ కు చెందిన మసాజో నొనాకా(112) ఎంపికయ్యారు. దీంతో ఈయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. గతంలో ఈ రికార్డు స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో నూనెజ్ ఒలివెరా(113) పేరుపై ఉండేది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు చనిపోవడంతో ఈ రికార్డును ఇప్పుడు నొనాకా దక్కించుకున్నారు.

జపాన్ లోని హొక్కయిడో ద్వీపంలో 1905 జులై-25న నొనాకా జన్మించారు. 1931లో నొనాకాకు వివాహమైంది. ఈయనకు ఐదుగురు పిల్లలు. స్వీట్లు, వేడినీటి స్నానాల వల్లే ఆయన ఎక్కువ కాలం జీవిస్తున్నారని, అదే ఆయన జీవిత విజయ రహస్యమని కుటుంబ సభ్యులు తెలిపారు. మసాజో నొనాక కుటుంబ సభ్యులు ఓ హాట్ స్ప్రింగ్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన ప్రతిరోజూ తప్పకుండా న్యూస్ పేపర్స్ చదువుతారు. అన్ని రకాల స్వీట్లను ఇష్టంగా తింటారని ఆయన మనుమరాలు చెప్పారు. జపాన్ లో 68 వేల మంది 100 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

PP

Posted in Uncategorized

Latest Updates