నేనే రాజు.. నేనే మంత్రి : చైనా అధ్యక్ష పీఠం కోసం జిన్‌పింగ్ వ్యూహాలు

xxi-jinpingచైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కొత్త ప్లాన్ చేశారు. తన అధికారం చేజారకుండా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీపై పట్టు సాధించిన ఆయన అధ్యక్షుడిగా ఆ పదవిలో శాశ్వతంగా కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రస్తుతం రెండోసారి ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం పూర్తవనుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు మావో సె టుంగ్ తర్వాత దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత హోదాను పొందిన జీ జిన్‌పింగ్ తన పదవిని శాశ్వతం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు.

చైనాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఎవరైనా కేవలం రెండుసార్లు మాత్రమే కొనసాగుతారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావం నుంచీ ఇదే నిబంధన అమలవుతోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఈ నిబంధనను పక్కన పెట్టి 64 ఏళ్ల వయసున్న ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆ దేశ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు. ఇదే జరిగితే కేవలం దేశాధ్యక్షుడిగానే కాదు అంతకంటే శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా జనరల్ సెక్రెటరీగా కూడా శాశ్వతంగా ఆయనే కొనసాగనున్నారు.

రాజ్యాంగ సవరణ ద్వారా మార్చి 5న ప్రారంభ‌మయ్యే పార్ల‌మెంటు స‌మావేశాల్లో మ‌రోసారి జీ జిన్‌పింగ్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక అయ్యే అవ‌కాశం ఉంది. ఈ మార్పు తప్పదని భావించి క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఈ నిర్ణ‌యానికే మొగ్గుచూపిందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates