నేపాల్ అభివృద్దికి భారత్ అండగా ఉంటుంది : మోడీ

MODIనేపాల్- భారత్  మధ్య సంబంధాలను  మరింత బలోపేతం  చేస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోజు(ఏప్రిల్ 7) ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో  రెండు దేశాల మధ్య  పెట్రోలియం  ఉత్పత్తుల కోసం  పైప్ లైన్ ను  నేపాల్ ప్రధాని ఓలీతో కలిసి  ప్రారంభించారు. అంతకు ముందు.. ద్వైపాక్షిక  సంబంధాలపై  ఇద్దరు నేతలు  చర్చలు జరిపారు.  నేపాల్ అభివృద్ధి  కోసం భారత్ అండగా ఉందన్నారు మోడీ. సరిహద్దులో భద్రత విషయంలో ఒకరికొకరం సహకరించుకుంటామని మోడీ తెలిపారు. భారత్‌ తో సంబంధాలకు నేపాల్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఓలీ అన్నారు. మోడీని  నేపాల్ పర్యటనకు  ఆహ్వానించారు  ఖడ్గ ప్రసాద్  ఓలీ.

Posted in Uncategorized

Latest Updates