నేరం చేస్తే ‘ఫేసు’ బుక్కయిపోద్ది

హైదరాబాద్:  నేరస్తులను గుర్తించి, నేరాలను అరికట్టడానికి పోలీసులు మరో ముందడుగు వేశారు. నేరస్థులను సులువుగా గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ ఆర్ఎస్) అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీంతో ముఖ కవలికల ఆధారంగా నేరస్తులను క్ష‌ణాల్లో గుర్తిస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను కూడా పట్టుకోవచ్చు.

ఈ సిస్టంను రాష్ర్ట వ్యాప్తంగా ఉండే పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తారు. రాష్ర్టంలో ఏ ప్రాంతంలోనైనా పాత నేరస్తుడు,అనుమానితుడు తిరిగితే ఈజీగా పట్టుకుంటారు. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అధికారులతో పాటు ఉన్నతాధికారులకూ చేరుతుంది. దీంతో విచారణ తేలికవుతుంది. ఇంతకాలం విచారణలో ఉన్న సమస్యలు తొలగించేందుకు కేంద్ర రక్ష‌ణశాఖ సహాయంతో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఎఫ్ఆర్ఎస్ ఉపయోగిస్తున్న మొదటి రాష్ర్టం తెలంగాణనే. కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ ద్వారా నేషనల్ క్రైం బ్యూరో… నేరస్తులు,నేరాల పై నిఘా ఉంచుతుంది.

Posted in Uncategorized

Latest Updates