నేరుగానే తిట్టేస్తున్నాడు : మోడీ అవినీతి పరుడు

rahulమోడీ ఒక అవినీతి పరికరం అని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బంతా కార్పొరేట్లకు దోచి పెడుతున్నారన్నారు. బీజేపీ తమ ప్రచారం అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేస్తోందన్నారు రాహుల్. ఆ డబ్బంతా బ్యాంకులను మోసం చేస్తున్న వారి నుంచే వస్తోందని సీరియస్ అయ్యారు. బుధవారం (ఫిబ్రవరి-21) మేఘాలయా టూర్ లో ఉన్న ఆయన.. షిల్లాంగ్ లో రోడ్ షో తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీపై మొదటిసారి రాహుల్ గాంధీ నేరుగా టార్గెట్ చేశారు. ఫస్ట్ టైం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దిగారు. జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. మాటల వాడి పెంచారు. ఎప్పుడూ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శించే రాహుల్.. ఇప్పుడు నేరుగా మోడీని తిట్టిపోస్తున్నారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మాల్యాల బ్యాంక్ దోపిడీలతోపాటు రక్షణ శాఖలో కొనుగోళ్లలో మోడీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates