నేరేళ్ల విశ్వవిఖ్యాత కళాకారుడు : కేసీఆర్

మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ మృతిపట్ల సంతాపం ప్రకటించింది శాసనమండలి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ ..నేరేళ్ల వేణుమాధవ్ విశ్వవిఖ్యాత కళాకారుడు అని గుర్తు చేశారు. నేరెళ్ల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిమిక్రీ కళను ప్రపంచదేశాలకు చాటి చెప్పారన్నారు. వరంగల్ జిల్లాకు నేరేళ్ల గొప్ప పేరు తెచ్చినట్లు చెప్పారు.

నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఒక పాఠ్యాంశంగా కూడా ఆయన జీవిత చరిత్రను పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విశ్వనాథ సత్యనారాయణ, సినారె లాంటి కవులు తమ పుస్తకాలను వేణుమాధవ్‌కు అంకితమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నేరెళ్లను వేణుమాధవ్‌ ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని సీఎం తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates