నేవీ మహిళలకు మోడీ అభినందనలు

MODIనావికా సాగర్ పరిక్రమ పూర్తి చేసిన నేవీ మహిళా అధికారులను అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషీ నాయకత్వంలో లెఫ్టినెంట్ కమాండర్లు ప్రతిభా జమ్వాల్, స్వాతి, లెఫ్టినెంట్లు ఐశ్వర్య బొడ్డపాటి, విజయా దేవి, పాయల్ గుప్తాలు గతేడాది సెప్టెంబర్ 10 న గోవా నుంచి ప్రపంచ యాత్రకు బయల్దేరారు. ఈ నెల 21న వారు తిరిగి గోవా చేరుకున్నారు. వారంతా బుధవారం (23) ఢిల్లీలో మోడీని కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపిన మోడీ భవిష్యత్ లక్ష్యాలపై మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates