నేషనల్ స్పోర్ట్ అవార్డ్స్ : అర్జున అవార్డు అందుకొన్న తెలంగాణ తేజం

టీమిండియా  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను దేశ అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను అందుకున్నారు. మంగళవారం(సెప్టెంబర్-25) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కోహ్లీ, చాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అందుకొన్నారు.

విధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు వరించాయి. 20 మంది అథ్లెట్లు అర్జున అవార్డుని అందుకొన్నారు. ఈ 20 మందిలో థింగ్ ఎక్స్ ప్రెస్ హిమదాస్, తెలంగాణ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డి కూడా ఉన్నారు.

8మందికి ద్రోణాచార్య, నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డులను అందజేశారు. రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న పురస్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు,  అర్జున  అవార్డీలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారం అందజేశారు.

.

Posted in Uncategorized

Latest Updates