నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు….31 మంది మృతి

nizeeనార్త్ ఈస్ట్ నైజిరియాలో బొకోహరమ్‌ టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. రెండుసార్లు జరిపిన దాడుల్లో 31 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. డాంబోవ్ సిటీలో శనివారం(జూన్-16) రాత్రి ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. ఇది ఖచ్చితంగా ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ బొకోహరమ్‌ పనే అని అధికారులు భావిస్తున్నారు. మెదట ఆత్మాహుతి దాడి చేసిన టెర్రరిస్టులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్స్‌ తో దాడి చేశారు. ఆత్మాహుతి దాడిలో చనిపోయిన వారికన్నా రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

Posted in Uncategorized

Latest Updates