నొప్పి లేకుండా : మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ రేట్లు

petrolపెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం తగ్గిన ధరలు.. ఇప్పుడు మళ్లీ భగ్గుమంటున్నాయి. 15 రోజులుగా ప్రతి రోజు 20 నుంచి 25పైసలు పెరుగుతూ వస్తున్నాయి. 24 గంటల్లోనే పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 28పైసల ధర పెరిగింది. మార్చి 31వ తేదీ శనివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 78 రూపాయలకు చేరింది. ప్రాంతాలను బట్టి ఇది రూ.77.89పైసల నుంచి 78 రూపాయల వరకు ఉంది. ఇక డీజిల్ కూడా లీటర్ 70 రూపాయలకు చేరింది. నెల రోజుల క్రితంతో పోల్చితే లీటర్ ధరపై కనీసం 3 రూపాయలు పెరిగింది.

మార్చి ఒకటో తేదీన పెట్రోల్ ధర లీటర్ రూ.75.80పైసలుగా ఉంటే.. ఇప్పుడు రూ.78కి చేరింది. అదే విధంగా డీజిల్ ధర రూ.67.50పైసలుగా ఉంటే.. ఇప్పుడు రూ.70కి చేరింది. నెల రోజుల్లోనే ఇంధన ధరలు పెరగటంతో వాహనదారులు ఆందోళనగా ఉన్నారు. నెల క్రితం తగ్గుతున్నట్లు కనిపించిన రేట్లు.. ఇప్పుడు ప్రతిరోజు 20పైసల చొప్పున పెరగటంతో ఆగ్రహంగా ఉన్నారు. లీటర్ పెట్రోల్ రూ.80 అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates