నోకియా 8.1 వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవిగో

దుబాయ్ : ఫిన్ లాండ్ కంపెనీ HMD గ్లోబల్.. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ ను వినియోగదారులకు అందిస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే నోకియా 7.1 మోడల్ ను తీసుకొచ్చింది. అప్ డేటెడ్ సరుకుతో ఇపుడు లేటెస్ట్ గా నోకియా 8.1 మోడల్ ను లాంచ్ చేసింది. మనదేశంలో కాదు. దుబాయ్ లో ముందుగా లాంచ్ చేసింది. యూరోపియన్, మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ మార్కెట్లలో డిసెంబర్ మూడోవారం నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. దీని ధరను 399 యూరోలుగా డిసైడ్ చేశారు. భారత కరెన్సీలో దాదాపుగా రూ.32 వేలు అన్నమాట. ఐతే… ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తే ఫోన్ ధరలో మార్పు ఉండొచ్చు.

మనదేశంలోనూ నోకియా 8.1 మోడల్ ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. డిసెంబర్ 10వ తేదీన హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఓ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. అప్పుడే ఈ మోడల్ ను పరిచయం చేస్తారని సమాచారం.

నోకియా 8.1 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఆసక్తికరమైన ఫీచర్లు ఇవే.

  • OS : ఆండ్రాయిడ్ 9.0- Pie
  • 6.18” హెచ్ డీ+ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ ప్లే
  • కార్నింగ్ గొరిల్లా 2.5 డీ గ్లాస్
  • ప్యూర్ డిస్ ప్లే స్క్రీన్ టెక్నాలజీ
  • స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, మల్టీ కోర్ ఏఐ ఇంజిన్
  • 4 జీబీ LPDDR4x ర్యామ్
  • 3,500 mAh బ్యాటరీ
  • 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 12 మెగాపిక్సెల్- 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరాలు
  • సూపర్ సెన్సిటివ్ సెన్సార్

ఆండ్రాయిడ్ 9- ‘పై’ వెర్షన్ పై లాంచ్ అవుతున్న ఫస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ ఇదే. బ్లూ/సిల్వర్, స్టీల్ /కాపర్, ఐరన్/స్టీల్ కలర్ కాంబినేషన్ లో ఈ ఫోన్ లభించనుంది.

Posted in Uncategorized

Latest Updates