‘నోటా’ సినిమాపై ఈసీకి కంప్లయింట్

హైదరాబాద్ : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా నోటా అక్టోబర్ ఐదున విడుదలవుతోంది. ఈ సినిమా రాజకీయ కథాంశంతో రూపొందింది. నోటా సినిమా.. వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే అనుమానంతో ప్రభుత్వానికి, పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఓ ఫిర్యాదు అందింది.

నోటా సినిమా వచ్చే ఎన్నికల్లో ఓట్లను ప్రభావితం చేస్తుందని ఆరోపిస్తున్నారు సినీ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర డీజీపీ చూసిన తర్వాతే.. సినిమాను విడుదల చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కేతిరెడ్డి… మంచి చెడులుచూసిన తర్వాతే.. నోటా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates