నోట్లు మాయం అవుతున్నాయా : ఆ రూ.45వేల కోట్లు ఎటుపోయాయి

sbirajnish kumarదేశంలోని పలు రాష్ట్రాలలో ATMలో డబ్బు లేకపోవటం సంచలనం అయ్యింది. ఏ ATM చూసినా నో క్యాష్ బోర్డులు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఇండియా స్పందించాయి.

మూడు నెలలుగా నగదుకి డిమాండ్ బాగా పెరిగిందని తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ. ముఖ్యంగా రెండు వారాలుగా పరిస్థితి దిగజారిందని.. కేవలం 13 రోజుల్లోనే రూ.45వేల కోట్లను సరఫరా చేశామని తెలిపారు. ఆ డబ్బంతా జనంలోకి వెళ్లిందని.. తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావటం లేదన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, కర్నాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి రోజు 500 కోట్ల విలువైన రూ.500 నోట్లను ముద్రిస్తున్నాం అని.. దీన్ని నాలుగు రెట్లకు పెంచటం జరుగుతుందని కూడా తెలిపింది.

ఇక రిజర్వ్ బ్యాంక్ కూడా రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా నగదు కొరతపై సమీక్ష నిర్వహించింది. రాబోయే నెల రోజుల్లో 75 వేల కోట్ల విలువైన 500 నోట్లను మార్కెట్ లోకి సరఫరా చేయాలని నిర్ణయించింది. రైతుల సీజన్ వచ్చిందని.. వారికి అందాల్సిన పేమెంట్లు ఎక్కువగా ఉండటంతో భారీ ఎత్తున నగదు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

 

Posted in Uncategorized

Latest Updates