నోట్ల ఎఫెక్ట్ : రంజాన్ వ్యాపారస్థులకు భారీ దెబ్బ

RAMZనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నదంటున్నారు వ్యాపారులు. మూడేళ్లుగా గిరాకులు లేక.. కష్టాల్లో షాపులు నడుపుతున్నామంటున్నారు. కనీసం షాపుల కిరాయి కట్టలేని పరిస్థితి ఉందని చెప్పారు. రంజాన్ మాసం అయినా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు లేవంటున్నారు ఖమ్మం వ్యాపారులు.

డిమానిటైజేషన్ నుంచి మొదలు.. ఇప్పటివరకు తమను కష్టాలు వెంటాడుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఓ వైపు క్యాష్ కొరత.. ఇంకోవైపు జీఎస్టీ. దాంతో బిజినెస్ డల్ అయిందంటున్నారు. షాపు గడవడమే కష్టంగా ఉందంటున్నారు. గిరాకులు లేక దివాళ తీస్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్ మాసంలో దాదాపు 50 కోట్ల వ్యాపారం జరిగేది. కానీ డిమానిటైజేషన్ తర్వాత సీన్ మారిందంటున్నారు వ్యాపారులు. కనీసం షాపు కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఉందంటున్నారు. నోట్ల రద్దు అయిపోయిందో లేదు.. జీఎస్టీ పిడుగులాగా వచ్చిపడిందంటున్నారు. దాంతో మూడేళ్లుగా  కష్టాల్లో నెట్టుకొస్తున్నామంటున్నారు. అకౌంట్లలో డబ్బులున్నా.. డ్రా చేయడానికి జనం ఇష్టపడటం లేదంటున్నారు వ్యాపారులు.

దాంతో రంజాన్ మాసం అయినా వ్యాపారాలు లేక సరుకు అమ్ముడుపోక.. తెచ్చిన అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నామంటున్నారు. రంజాన్ మాసంలోనే గిరాకి ఇలా ఉంటే.. పండుగ అయిపోయాక తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు వ్యాపారులు. రెండు కొంటే ఒకటి ఫ్రీ, బంపర్ డ్రాలో కార్లు, బట్టలు కొంటే స్కూల్ బ్యాగులు, బ్యాగులు కొంటే సాక్సులు, ఇలా రక రకాల ఆప్లర్లు పెట్టి పబ్లిక్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు. పాంప్లెట్లు, లోకల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకుంటున్నారు.

అయినా గిరాకీ అంతంత మాత్రంగానే ఉంటుందంటున్నారు. వర్కర్లను పెట్టకుండా ఇంటిల్లిపాది షాపులో పనిచేస్తే అక్కడిక్కడికి సరిపోతుందని చెబుతున్నారు. మూడేళ్ళ నుంచి వ్యాపారం అంతంత మాత్రంగానే జరుగుతోందని అంటున్నారు. క్యాష్ కొరతను తీర్చాలని కోరుతున్నారు వ్యాపారులు. ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో తమకు గిరాకీ ఉండటం లేదంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates