నోట్ల రద్దు,జీఎస్టీల వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది : ERP

moditrumpనోట్ల రద్దు, జీఎస్టీల వల్లే భారత్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వెల్లడించింది ద ఎకనమిక్ రిపోర్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ (ERP). 90 శాతం నగదు లావేదేవీలు ఉండే ఇండియాలాంటి దేశంలో 86 శాతం ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల వృద్ధిరేటు ఒక్కసారిగా మందగించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇక ఇండియా బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులు పెరిగిపోతుండటంపై కూడా ఆందోళన వ్యక్తంచేసింది ఈఆర్పీ. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఐఎంఎఫ్ చెప్పిన వివరాల ప్రకారం.. 2017 మూడో త్రైమాసికంలో మొత్తం రుణాల్లో నిరర్ధక ఆస్తులు 9.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 2014-15తో పోలిస్తే.. వీటి విలువ రెండింతలైంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్.. అందులోనూ ఎస్‌బీఐదే ఇందులో మెజార్టీ వాటా అని ఆ నివేదిక స్పష్టంచేసింది. అంతేకాదు ఈ నిరర్ధక ఆస్తులు 2018 తొలి త్రైమాసికంలో 10.8 శాతానికి, సెప్టెంబర్ త్రైమాసికంలో 11.1 శాతానికి పెరుగొచ్చని ఇప్పటికే అంచనా వేసింది ఆర్బీఐ. అయితే రానున్నకాలంలో బ్యాంకులకు రెండు లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయమని ఆ రిపోర్ట్ స్పష్టంచేసింది.

Posted in Uncategorized

Latest Updates