నోట్ల రద్దుతో నలుగురు చనిపోయారు : కేంద్రం

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు కారణంగా నలుగురు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పెద్దనోట్ల రద్దు ప్రభావంపై ఎలాంటి స్టడీ చేయలేదని చెప్పింది. 2016లో ముగ్గురు బ్యాంకు సిబ్బంది, ఒక కస్టమర్ చనిపోయారని, వారి కుటుంబ సభ్యులకు పరిహారం కూడా ఇచ్చామని తెలిపింది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి రాజ్యసభలో సీపీఎం ఎంపీ ఎళమారన్ కరీం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వివరాలు తెలిపారు.

‘పెద్దనోట్ల రద్దు తర్వాత ముగ్గురు బ్యాంకు సిబ్బంది, ఒక కస్టమర్ చనిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్పింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.3 లక్షలు, ముగ్గురు బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు మొత్తం రూ.44 లక్షల పరిహారం ఇచ్చాం’ అని జైట్లీ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates