నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు నామినేట్

donald_trumpఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో ట్రంప్ చారిత్రక భేటీ ప్రపంచ శాంతి కోసమేనని భావించిన ఇద్దరు నార్వే ఎంపీలు ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆయన పేరును నామినేట్ చేశారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ కోసం.. ఉత్తర కొరియాతో ఒప్పందం చేసుకునేలా ట్రంప్ కృషి చేశారని సదరు ఎంపీలు కొనియాడారు. ‘‘దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, శాంతి, నిరాయుధీకరణ దిశగా ట్రంప్ అత్యంత కీలకమైన చర్యలు తీసుకున్నారు…’’ అని అభివర్ణించారు ట్రంప్ పేరును నామినేట్ చేసిన ఎంపీలు క్రిస్టియన్ టైబ్రింగ్ జేడ్, పెర్-విల్లే అముండ్సేన్. కాగా మేలో అమెరికాలోని కొందరు రిపబ్లికన్లు కూడా 2019 సంవత్సరానికి గానూ నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates