నోయిడాలో కుప్పకూలిన భవనాలు..ఇద్దరు మృతి

గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా… అనేకమంది గాయపడ్డారు. మంగళవారం (జూలై-17) రాత్రి షాబేరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంపై పడటంతో ఈ నాలుగు అంతస్థుల భవనం సైతం కుప్పకూలింది. భవన శిధిలాలను NDRF బృందాలు తొలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

శిథిలాల కింద 18 కుటుంబాలు ఉన్నట్లు తెలిసింది. సహాయక చర్యలను వేగవంతం చేయాలని యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్… అధికారులను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates