నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..వంద గుడిసెలు దగ్దం

FIREనోయిడాలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. వందలాది గుడిసెలు అగ్నిఅహూతి అయ్యాయి. 49వ సెక్టార్ బారావుల్లా గ్రామంలో సోమవారం (మే-28) రాత్రి 2గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందోనని తెలుసుకోనేలోగా… ఇంట్లో సామాన్లు కాలిబూడిదయ్యాయని బాధితులు వాపోయారు. అగ్నిప్రమాదంలో సైకిళ్లు, పలు వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ల ఇంజిన్ల సహయంతో మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో ఆస్తినష్టం తప్పా…. ఎలాంటి ప్రాణనష్టం, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates