నోరెళ్లబెట్టారు : 23కేజీల బంగారు బిస్కెట్లు పట్టివేత

goldదేశంలోనే ఫస్ట్ టైం.. ఒకేసారి.. ఓ వ్యక్తి నుంచి 23 కేజీల బంగారాన్ని పట్టుబడింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఫిబ్రవరి 11వ తేదీ అర్థరాత్రి.. కెన్యా నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి దిగాడు. అతని పేరు అబ్దుల్లా అలీ సయిద్. కెన్యా రాజధాని నైరోబీ నుంచి వచ్చాడు. ఇతను కెన్యా ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఉద్యోగి. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో.. ఎయిర్ ఇంటెలిజెంట్ యూనిట్ (AIU), సహర్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు.

విచారణ అధికారులతోపాటు ఎయిర్ పోర్ట్ అధికారులు షాక్ అయ్యారు. అతని దగ్గర 23 కేజీల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. వాటి విలువ అక్షరాల రూ.6 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంగా బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి. కెన్యా ఎయిర్ పోర్ట్ ఉద్యోగి కావటంతో తనిఖీలు ఉండవని భావించిన స్మగ్లింగ్ గ్యాంగ్.. అతని పావుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. సయిద్ తీసుకొచ్చిన బంగారం తీసుకోవటానికి.. హోటల్ లో వెయిట్ చేస్తున్న ఇబ్రహీం హుస్సేన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

ఈ 23 కేజీల బంగారం.. 156 బిస్కెట్ల రూపంలో ఉంది. వీటిని ఫుడ్ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంగా బంగారం పట్టుబడటం ఇదే. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates