నో కండీషన్స్.. అందరికీ వర్తింపు : రూ.12తో రెండు లక్షల బీమా

INSURANCEబ్యాంకు ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ప్రీమియంతో బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.12తో సురక్ష, రూ.330తో జీవన్‌ జ్యోతి పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి వర్తింపజేసేందుకు నిర్ణయించారు. మొదట గ్రామాలను వర్తింపజేసేందుకు బ్యాంకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

బ్యాంకు ఖాతాదారుని నుంచి రూ.12 అతి స్వల్ప ప్రీమియం కట్టించి, బీమాను ప్రారంభిస్తారు. పాలసీదారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలను బాధిత కుటుంబానికి అందిస్తారు. రూ.330 ప్రీమియంగా చెల్లిస్తే.. జీవన్‌ జ్యోతి పాలసీని వర్తింపజేస్తారు. జీవన్ జ్యోతి పాలసీదారు సాధారణంగా మరణించినా.. ఆ కుటుంబాలకు రూ.2 లక్షలు నగదు అందిస్తారు. సురక్ష పాలసీకి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్నవారు…. జీవన్‌ జ్యోతి పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు అర్హులు అని తెలిపింది కేంద్రం.

Posted in Uncategorized

Latest Updates