నో ఛేంజ్: దేశం మొత్తం ఒకే టైమ్

time
భారత దేశంలో కొన్ని రంగాల్లో రకరకాల సమయాలను పాటిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే, పోలీస్ శాఖలో 24 గంటల ఫార్మాట్ ను పాటిస్తారు. అయితే విధానాన్ని మార్చడంతో పాటు అన్ని రంగాల్లో దేశ వ్యాప్తంగా ఒకే టైంను అనుసరించేలా చర్యలు చేపట్టనుంది. దీని కోసం కొత్త ప్రాజెక్టును  ప్రారంభించనుంది. దీని కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది అమలు అయితే ఒకే ప్రామాణిక సమయంతో పాటు మరింత కచ్చితత్వంతో కూడిన సమయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో బ్యాంకింగ్, టెలికాం, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, రైల్వే ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ తదితర రంగాల్లో ఒకే రకం రావడంతో పాటు పలు ఇతర కీలక మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రాంతీయ రెఫరెన్స్‌ స్టాండర్డ్స్‌ లేబొరేటరీ(RRSL) ల మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అలాంటివి మరో రెండింటిని నెలకొల్పుతారు. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఫరీదాబాద్, గౌహతిలో ఉన్న ల్యాబ్‌ల బలోపేతానికి నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీ(NPL) సాయం తీసుకుంటారు.

దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లు, కంప్యూటర్లను ఒకే జాతీయ గడియారంతో అనుసంధానించడం తప్పనిసరని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వేర్వేరు రంగాల్లో వేర్వేరు టైమ్ లు అమల్లో ఉండటంతో సైబర్‌ నేరాల విచారణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వ్యూహాత్మక ప్రణాళికలు, జాతీయ భద్రత కోసం మార్పులు జరగాలని అన్నారు. ఒకే ప్రామాణిక సమయంతో మొబైల్‌ ఫోన్‌ బిల్లులు కూడా తగ్గుతాయని ఆ శాఖ కార్యదర్శి అవినాశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన రూ.100 కోట్లలో ఈ ఏడాది బడ్జెట్‌లోనే రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. టెలికాం, ఇంటర్నెట్‌ సేవలందిస్తున్న సంస్థలు ఒకే ప్రామాణిక సమయాన్ని పాటించడం లేదని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యదర్శుల టీం గతంలోనే తెల్చిచెప్పింది.

Posted in Uncategorized

Latest Updates