నో ట్రాఫికర్ : స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేక రోడ్లు

smaస్మార్ట్ ఫోన్ చేతులో లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనివారికి శుభవార్త. రోడ్డుపై నడుస్తున్న సమయంలోకి కూడా చేతుల్లో నుంచి స్మార్ట్ ఫోన్ ని వదల్లేకపోతున్నారా… అయితే  అటువంటి వాళ్లు హాయిగా చైనా వెళ్లవచ్చు. స్మార్ట్ ఫోన్ లకు బానిసలైన వారి కోసం చైనాలోని రోడ్లపై ప్రత్యేకంగా లేన్లు వేశారు. ఈ లేన్లపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫోన్ వాడుకుంటూ నడవవచ్చు.

చైనా షాంగ్జీ రాష్టంలోని వ్యాపార జిల్లాగా పేరున్న ఇన్ షియాన్ లోని ఓ షాపింగ్ సెంటర్ స్మార్ట్ ఫోన్ బానిసల కోసం ప్రత్యేకంగా ఓ లేన్ ను నిర్మించింది. స్మార్ ఫోన్ బానిసలకు మాత్రమే అంటూ వార్నింగ్ లు, సూచికలతో లేన్ నిర్మాణం చేశారు. ఒక మీటరు వెడల్పుతో వందల మీటర్లు ఈ లేన్ ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలను ఈ లేన్ పక్కగా వెళ్లేందుకు డైరక్ట్ చేయడానికి సేఫ్టీ గార్డ్స్ ని నియమించారు. అయితే స్మార్ట్ ఫోన్ బానిసలను పెంచుతున్నారంటూ ఈ లేన్ నిర్మాణంపై సిటీ ప్రజల నుంచి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 2014లో కూడా చైనాలో మెదటిసారిగా చాంగ్ క్వింగ్ మున్సిపాలిటీలో మొబైల్ ఫోన్ సైడ్ వాక్ నిర్మాణం జరిగింది. ఈ సైడ్ వాక్ 3 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవు ఉంటుంది. మెబైల్ ఫోన్ యూజ్ చేస్తూ సడుస్తున్న వారిని, యూజ్ చేయకుండా నడిచే వారిని ఈ సైడ్ వాక్ సపరేట్ చేస్తుంది. చైనా లెక్కల ప్రకారం జనవరి,2012 నుంచి జూన్,2017 వరకూ జరిగిన యాక్సిండెట్లలో 10.5 శాతం రోడ్డుపై నడుస్తూ, వెళ్లూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్లే జరిగాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ లేన్ నిర్మాణం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates