నో ప్లాస్టిక్ : రైల్వేస్టేషన్లలో ప్లాస్టిక్ క్రషింగ్ మెషిన్ల ఏర్పాటు

plaప్లాస్టిక్ ను అరికట్టేందుకు రైల్వేశాఖ కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాస్టిక్ క్రషింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తోంది.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిటీలోని రైల్వే స్టేషన్లలో ఈ మిషిన్లను అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ క్రషర్ యూనిట్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ. సిటీలోని కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ తో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని మరికొన్ని రైల్వేస్టేషన్లలో ప్లాస్టిక్ గ్రైండింగ్ మెషిన్లను ఏర్పాటు చేసింది.

రైలు ప్రయాణికులు ప్రతిరోజు ట్రాక్స్, కంపార్ట్ మెంట్స్ పై వాడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వేయడంతో సమస్యగా మారిందంటున్నారు రైల్వే అధికారులు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని అరికట్టడానికి రైల్వేస్టేషన్లలో క్రషర్ యూనిట్స్ ఏర్పాటు చేశామన్నారు. వాడేసిన వాటర్ బాటిల్స్ ను మెషిన్ లో వేస్తేచాలు చిన్నచిన్న ముక్కలుగా చేస్తుందంటున్నారు.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను కరిగించే క్రషింగ్ మెషిన్లను రైల్వే స్టేషన్లలో పెట్టడం బాగుందంటున్నారు జనం. కొంతమంది కాంట్రాక్టర్లు ఖాళీ వాటర్ బాటిల్స్ లో నీరు నింపి అమ్ముతుంటారని అలాంటి వారికి కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని చెబున్నారు. ప్రస్తుతానికి స్టేషన్లలో ఒకటే మెషిన్ ఉందనీ..మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు.  ప్లాస్టిక్ ను పూర్తిగా కంట్రోల్ లో పెట్టడానికి తెచ్చిన ఈ మెషిన్స్ ను సిటీ మొత్తం పెట్టాలని కోరుతున్నారు హైదరాబాద్ జనం.

 

Posted in Uncategorized

Latest Updates