నో హెల్మెట్.. నో పూజ : పోలీసుల వినూత్న నిర్ణయం

No-Helmet-No-Puja-of-New-Motorcycles-at-this-Odisha-Temple-2018-gfgహెల్మెట్‌ లేకపోతే ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్ వేయడం మనం డైలీ చూస్తూనే ఉంటాం. అయితే హెల్మెట్ లేకపోతే పూజారులు కూడా పూజ చేయమంటున్నారు.  కొత్త టూవీలర్ కొన్న ఎవరైనా మొదటి రోజు పూజ చేయించుకోవడం కోసం గుడికి వెళ్తారు.

అయితే ఈ పూజ సమయంలో చాలా మంది హెల్మెట్ లేకుండానే బైక్ పూజ కోసం గుడికి వెళ్తున్నారు. అయితే ఇక నుండి బండితో పాటు హెల్మెట్ చూపిస్తేనే పూజ చేస్తామని ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలోని ప్రతిష్టాత్మక సరళాదేవి మాతా ఆలయ పూజారులు చెబుతున్నారు. హెల్మెట్ లేనివారిని తిప్పి  పంపుతున్నామన్నారు. స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ పూజారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లోనూ  ‘నో హెల్మెట్‌.. నో పూజ’ అనే బోర్డులు పెట్టడంతో ఆలయానికి వచ్చిన  భక్తులంతా హెల్మెట్‌ అవసరంపై చర్చించుకుంటాన్నారని తెలిపారు పూజారులు.

ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో తామూ భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ఎవరు కొత్త బండి కొన్నా.. ఈ ఆలయానికే వచ్చి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అందుకే ఈ ఆలయంలోనే ‘నో హల్మెట్‌.. నో పూజ’ను అమలు చేయాలని భావించామని తెలిపారు పోలీసులు. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని  తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates