న్యాయవాదులకు సంక్షేమ పథకాలు

ED-240518-ADVOCATEWELFARE-PKG-1న్యాయవాదుల సంక్షేమంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి న్యాయవాదుల సంక్షేమ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. న్యాయవాదితో పాటు  జీవిత భాగస్వామికి  రెండు లక్షల ఆరోగ్య బీమా, ప్రమాదంలో మరణించన కుటుంబానికి బీమా కింద 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ఇన్సురెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది న్యాయవాదుల ట్రస్ట్. న్యాయ వాదుల సంక్షేమ పథకాలపై సెక్రటేరియట్ లో సమీక్ష చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ట్రస్ట్  సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు పాల్గొన్నారు.

ఆరోగ్య బీమా కోసం యునైటెడ్ ఇండియా ఇన్సురెరన్స్ కంపెనీకి 8.50 కోట్ల చెక్కును, ప్రమాద బీమా కోసం ఓరియంటల్ ఇన్సురెన్స్ ప్రతినిధికి 33.30 లక్షల చెక్కును అందజేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆరోగ్య బీమా కోసం 18 వేల మంది న్యాయ వాదులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పథకాలతో పాటు మరికొన్ని  సంక్షేమ పథకాలను జూన్ 2న ప్రారంభిస్తామన్నారు మంత్రి.

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారన్నారు ఎంపీ వినోద్.  న్యాయవాదులకు ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వడం గొప్ప నిర్ణయమన్నారు. వంద కోట్లతో అడ్వకేట్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు వినోద్.

Posted in Uncategorized

Latest Updates