న్యూఇయర్ బంపర్ గిఫ్ట్ : జనవరి 1న పుట్టే ఆడబిడ్డకు రూ.5లక్షలు

కర్ణాటక : పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే.. కడుపులోనే చంపేస్తున్న రోజులివి. అలాంటి దారుణాలు జరగకుండా జనంలో అవగాహన కోసం ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను ప్రకటిస్తుంటాయి. ఇదే ఉద్దేశంతో  ఓ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది బెంగళూరు మున్సిపాలిటీ. 2019 న్యూ ఇయర్‌ (జనవరి-1) రోజున ఆడ పిల్ల పుడితే… వారికి రూ.5 లక్షలు బంపర్‌ బహుమానం అందిస్తామని BBMP(బృహత్ బెంగళూరు మహనగర పాలికె) ప్రకటించింది. ఈ విషయాన్ని బెంగళూరు మేయర్‌ గంగాంబిక తెలిపారు.

గత ఏడాది నుంచి BBMP పింక్‌ బేబీ పేరుతో న్యూ ఇయర్‌ మొదటి రోజున జన్మించిన ఆడపిల్లలకు రూ.5 లక్షలు అందించే స్కీమ్ ని అమల్లోకి తీసుకు వచ్చిందని.. ఈ ఏడాది కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు మేయర్. BBMP పరిధిలోని 24 హాస్పిటళ్లలో జనవరి ఫస్ట్ న పుట్టిన మొదటి 24 మంది ఆడపిల్లలకు తలా రూ.5 లక్షలు డిపాజిట్‌ చేస్తామని తెలిపారు. ఈ డబ్బు ఆడపిల్ల విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

జనవరి 1 తేదీన జన్మించిన మొదటి మగబిడ్డకు ఈ పథకం వర్తించదు. ఒక వేళ జనవరి 1 తేదీన  ఏ హాస్పిటల్ లోనూ ఆడపిల్ల పుట్టకపోతే… తర్వాత రోజు పుట్టే మొదటి ఆడబిడ్డకు నగదు బహుమానం అందుతుంది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates